తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లంపల్లి జలాశయానికి జలసవ్వడి... రికార్డుల ఒరవడి

భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతోమంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం జలకెరటంలా మారింది. ఈ ఏడాది అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో నిరంతరం నీటిని తరలిస్తున్నా నిండుకుండనే తలపిస్తోంది. రికార్డు స్థాయిలో జలాశయంలోకి 251.20 శతకోటి ఘనపుటడుగుల నీరు వచ్చి చేరింది. ఇప్పటికే క్రస్ట్‌ గేట్ల ద్వారా దిగువకు 218.07 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

heavy flow to  ellampally project in adilabad district
heavy flow to ellampally project in adilabad district

By

Published : Sep 30, 2020, 6:52 AM IST

Updated : Sep 30, 2020, 9:46 AM IST

  • జలాశయంలోకి పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా వర్షాకాలం ప్రారంభమైన జూన్‌ 8 నాటికి ప్రాజెక్టులో నీటి నిల్వ 5.56 టీఎంసీలుగా ఉంది.
  • ఆగస్టు 17 నాటికి క్రమంగా పెరుగుతూ 19.56 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. దీంతో అదే రోజు తొలిసారి 8 గేట్లు ఎత్తి 43,560 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
  • ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు వరదగా వచ్చిన ప్రవాహాన్ని క్రమం తప్పకుండా నిరంతరాయంగా దిగువకు వదులుతున్నారు.
  • సెప్టెంబర్‌ 16న గరిష్ఠంగా 4,10,484 క్యూసెక్కులు వరద జలాశయంలోకి వచ్చి చేరగా 28 గేట్లను ఎత్తి 4,09,836 క్యూసెక్కులు దిగువకు వదిలారు.
  • ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు కేవలం 41 రోజుల వ్యవధిలోనే 218 శతకోటి ఘనపుటడుగుల నీరు వృథాగా గోదావరిలోకి వదలాల్సి వచ్చింది. సగటున రోజుకు 5.31 టీఎంసీల చొప్పున దిగువకు వదులుతున్నారు.
  • సెప్టెంబర్‌ 29న జలాశయంలోకి వరదగా 2,77,128 క్యూసెక్కులు రాగా 27 క్రస్ట్‌ గేట్లను ఎత్తి 2,77,128 క్యూసెక్కులను దిగువకు వదిలారు.

కాళేశ్వరం ఎత్తిపోతల అవసరం లేకుండానే...

పార్వతి పంపుహౌజు ద్వారా ఎల్లంపల్లిలోకి తోడి పోసి అక్కడి నుంచి నీటిని నంది పంపు హౌజు ద్వారా మధ్య మానేరుకు తరలించేందుకు ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మించింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు కురవడం కొంత ఆలస్యం జరిగినా.. ఆగస్టు నుంచి పరివాహక ప్రాంతాల్లో అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదగా వచ్చి చేరిన నీటిలో ఇప్పటికే 218 శతకోటి ఘనపుటడుగులు గోదావరిలో కలిసింది. వర్షాకాలం ప్రారంభంలో 19.82 శతకోటి ఘనపుటడుగులు కాళేశ్వరం జాలాలను ఎత్తిపోసినప్పటికీ తర్వాత దశలో వాటి అవసరం లేకుండా పోయింది.

కడెం ద్వారా వచ్చింది 8.2 టీఎంసీలు

ఎల్లంపల్లికి అనుసంధానంగా ఉన్న కడెం జలాశయం ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 8.2 టీఎంసీల నీరు వరదగా జలాశయానికి వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టులోకి పరివాహక ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 16.78 టీఎంసీల నీరు వచ్చి చేరగా ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరడంతో మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. దీంతో నీటి ప్రవాహం ఎల్లంపల్లికి వచ్చి చేరింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మటన్​ వినియోగం

Last Updated : Sep 30, 2020, 9:46 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details