మంచిర్యాలలో ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
భారత జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడాలి: అజారుద్దీన్ - క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఆజారుద్దీన్
నేటి యువత సెల్‌ఫోన్ మోజులో పడి క్రీడలను మరిచిపోతున్నారని దీంతో మానసికంగా ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు స్మారకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు.
![భారత జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడాలి: అజారుద్దీన్ HCA president azaruddin started cricket tournament in mancherial district today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11009402-840-11009402-1615751209197.jpg)
భారత జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడాలి: అజారుద్దీన్
దాదాపు 350 జట్లు పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో నెల రోజులపాటు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గ్రామాల్లో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అనేక మంది ఉన్నారన్న అజారుద్దీన్.. భారత జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని క్రీడాకారులకు ఆయన సూచించారు.