నల్లని నేలపై.. పచ్చ తోరణం వన మహోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో మొక్కల నాటే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారి భారతి హోళీ కేరి, జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ హాజరయ్యారు.
ఆరేళ్లుగా హరితహారం విజయవంతమవుతోంది: కలెక్టర్ - కలెక్టర్ భారతి హోళీ కేరీ తాజా వార్తలు
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం గత ఆరేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని మంచిర్యాల జిల్లా పాలనాధికారి తెలిపారు. మందమర్రి సింగరేణి ఏరియాలో మొక్కల నాటే కార్యక్రమంలో రెండు వేల మొక్కలు నాటారు.
ఆరేళ్లుగా హరితహారం విజయవంతమవుతోంది: కలెక్టర్
కార్యక్రమంలో భాగంగా రెండు వేల మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం గత ఆరేళ్లుగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని పాలనాధికారి తెలిపారు. 33 శాతం అడవులు ఉన్నప్పుడే జీవ మనుగడ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. లక్షలాది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న సింగరేణి యాజమాన్యాన్ని అభినందించారు.