హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయం ఆవరణలో 108 కలశాల పూజ, సంక్షేప రామాయణ పంచముఖ హనుమత్ కవచం హోమం జరిపించారు.
నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు - మంచిర్యాలలో హనుమాన్ జయంతి వేడుకలు
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
![నిరాడంబరంగా హనుమాన్ జయంతి వేడుకలు Telangana news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:24:45:1622789685-tg-adb-21-04-jayanthi-av-ts10081-04062021104830-0406f-1622783910-535.jpg)
మంచిర్యాల జిల్లా వార్తలు
పంచామృతాలతో దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు పంచకుండాత్మక హనుమత హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఇదీ చూడండి:Record: ద.మ.రైల్వేకు రికార్డు స్థాయిలో పార్సిల్ ఆదాయం