తెలంగాణ

telangana

ETV Bharat / state

కస్తూర్బా గాంధీ పాఠశాలకు పచ్చని హారం - greenary in kasturbha gandhi school in manchiryala

పచ్చదనం మనసును పులకరింపజేస్తుంది. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా.. చెట్టు కింద సేద తీరితే అదంతా దూరమవుతుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్లు... మన అభివృద్ధికి మొక్కలు ఎంతో ఉపయోపడతాయి. ప్రకృతి మధ్య చదువులు కొనసాగిస్తే మరింత త్వరగా చదివింది ఒంటపడుతుంది. అందుకే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కస్తుర్బా గాంధీ పాఠశాలలో పచ్చని చెట్లు పెంచుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుతున్నారు.

పచ్చని హారం

By

Published : Sep 28, 2019, 8:02 PM IST

కస్తూర్బా గాంధీ పాఠశాలకు పచ్చని హారం

మంచిర్యాల జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల పచ్చదనాన్ని పరుచుకుంది. ఎటు చూసినా మొక్కలతో నిండి పోయింది. కస్తూర్బా పాఠశాలలో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల పుట్టిన రోజున మొక్కలు నాటుతారు. ఇప్పటి వరకు 600 రకాల మొక్కలు నాటారు. ప్రతి శనివారం ఇక్కడ విద్యార్థులు తోట పని చేస్తుంటారు. ఇటీవల ఆకుకూరలతోపాటు కూరగాయల సాగును ప్రారంభించారు.

మొక్కల దత్తత

పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలను దత్తత ఇచ్చారు. ఈ మొక్కలకు నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ఆ విద్యార్థులపై ఉంటుంది. పట్నం బంతి మొక్కలు పెరగడం వల్ల పాఠశాల కొత్త శోభను సంతరించుకుంది. ప్రకృతి అందాలను చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు మంత్ర ముగ్ధులవుతున్నారు.

మొక్కలకు తొట్లుగా

పాఠశాల వాడిన ఫినాయిల్ డబ్బాలు, తాగునీటి డబ్బాలను కత్తిరించి మొక్కలకు తొట్లుగా వినియోగిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు చురుకుగా గడ్డి తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్తరకం మొక్కలు ఏవి వచ్చినా.. ప్రత్యేక అధికారి చొరవ తీసుకుని విద్యార్థులతో నాటిస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే తోటమాలి భీమమ్మ మొక్కలపై చక్కని పాటలు పాడుతూ అలరింపజేస్తోంది. విద్యార్థులు కూడా ఈమె పాటలకు శ్రుతి కలుపుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చూడండి :హుజూర్​నగర్​లో వేడెక్కిన రాజకీయం...

ABOUT THE AUTHOR

...view details