తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో పామాయిల్​ తోటల పెంపకానికి గ్రీన్ సిగ్నల్ - kcr green signal palm oil plantations in mancherial district

మంచిర్యాల జిల్లాలో పామాయిల్​ తోటల పెంపకానికి ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే దివాకర్​రావు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

palm oil plantations in mancherial district
మంచిర్యాలలో పామాయిల్​ తోటల పెంపకానికి గ్రీన్ సిగ్నల్

By

Published : May 11, 2020, 3:15 PM IST

పామాయిల్​ తోటల పెంపకం ద్వారా రైతులు ఎకరాకు ఏటా లక్షా 20 వేల రూపాయల నుంచి రూ.లక్షా 50వేల ఆదాయం పొందవచ్చని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. జిల్లాలో పామాయిల్​ తోటల పెంపకానికి అనువుగా ఉన్న ప్రాంతాలు గుర్తించి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే దివాకర్ రావు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతే రాజుగా తెలంగాణ రైతు దిశను మార్చేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details