దేశంలోనే రాష్ట్ర పోలీసులు పనితీరులో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ప్రశంసించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన నూతన పోలీస్స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
'తెలంగాణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం'
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. దేశంలోనే రాష్ట్ర పోలీసుల పనితీరు బాగుందని ఆయన కొనియాడారు.
పోలీస్స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన బాల్క సుమన్
అనంతరం ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. రాష్ట్రప్రభుత్వం పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ ఛైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.