మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మామిడాల వెంకటరమణ... కరోనా సోకిందన్న అనుమానంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్‌కు చెందిన వెంకటరమణ తన కుటుంబంతో అక్కడే ఉంటున్నారు. అయితే అతనికి ఒక కిడ్నీ దెబ్బతినడంతో తొలగించారు. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మంచిర్యాలలో ఓ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కరోనా పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు.
కరోనా సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య - కరీంనగర్లో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. వైరస్ సోకితే చనిపోయేవారి సంఖ్య కన్నా... కోలుకుంటున్న వారి సంఖ్యే అధికంగా ఉందని వైద్యులు పదేపదే చెబుతున్నా... కొంతమంది మాత్రం వ్యాధి సోకిందనగానే ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నారు.
కరోనా సోకిందన్న అనుమానంతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
మంచిర్యాలలో పరీక్షలు చేయించుకోకుండా విధులు ముగించుకొని కరీంనగర్‌కు చేరుకున్నారు. కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా... స్పందించలేదు. దీంతో... వెంకటరమణ కుమారుడు కరీంనగర్‌లోని బంధువులకు సమాచారమిచ్చాడు. క్రిస్టియన్ కాలనీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కు వెళ్లి చూడమని సూచించాడు. వెళ్లి పరిశీలించగా... ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.