Goods Train Bogies Separated in Mancherial District: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్ రైలు ఇంజిన్ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఆ తరువాత ఇంజిన్ అర కిలోమీటర్ దూరం ముందుకెళ్లింది. గమనించిన లోకో పైలెట్ ఇంజిన్‌ను వెంటనే ఆపేశారు. ఈ విషయం తెలియడంతో.. బెల్లంపల్లి రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
రైలు వెళుతుండగానే ఇంజిన్ నుంచి వేరైన బోగీలు.. ఎక్కడంటే! - Mancherial Goods Train Bogies Separated
Goods Train Bogies Separated in Mancherial District: మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్ రైలు ఇంజిన్ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఇంజిన్ అర కిలోమీటర్ దూరం ముందుకెళ్లింది. దానిని గమనించిన పైలెట్లు రైలును వెంటనే ఆపేశారు.
![రైలు వెళుతుండగానే ఇంజిన్ నుంచి వేరైన బోగీలు.. ఎక్కడంటే! మంచిర్యాల జిల్లాలో వెళుతుండగానే బోగీలు వీడిన రైలు..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17054019-44-17054019-1669633360476.jpg)
మంచిర్యాల జిల్లాలో వెళుతుండగానే బోగీలు వీడిన రైలు..
సాంకేతిక సిబ్బంది బోగీలను ఇంజిన్‌కు అమర్చారు. చిన్న చిన్న మరమ్మతుల అనంతరం మళ్లీ గూడ్స్ రైలు ముందుకు కదిలింది. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల వ్యవధిలోనే ఓ ఎక్స్‌ప్రెస్ రైలు సాఫీగా వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు బోగీలు ఎందుకు విడిపోయాయోనని అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి: