పురపాలక సిబ్బంది కాళేశ్వరం జలాలు రాకముందు తొలగించాల్సిన చెత్తను నీరు వచ్చిన తర్వాత జేసీబీల సాయంతో తీస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గోదావరి నీటిని ఎంతో పవిత్రంగా భావించే ఇక్కడి ప్రజలకు.. పాలకులు, పురపాలక అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం ఆందోళన చెందేలా చేస్తున్నది. శ్రావణమాసంలో గోదావరికి పెద్ద ఎత్తున తరలివచ్చి పుణ్యస్నానం ఆచరించే భక్తులు ఇక్కడి పరిస్థితిని చూసి నిరాశ చెందుతున్నారు.
డంపింగ్ యార్డులా మారిన గోదావరి నది - పురపాలక సిబ్బంది
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి పరివాహక ప్రాంతం... చెత్త డంపింగ్ యార్డ్‌లా మారింది. పురపాలక సిబ్బంది చెత్తను డంప్ చేయడానికి గోదావరి తీరాన్ని చక్కగా వాడుకున్నారు. గోదావరినదిలో వ్యర్థాలను ఏరివేయాల్సిన అధికారయంత్రాంగమే గోదావరి పవిత్రతకు భంగం కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు.
డంపింగ్ యార్డులా మారిన గోదావరి నది
ఇవీ చూడండి: హైదారాబాద్ ఎంఎంటీఎస్‌కు 16 ఏళ్లు
Last Updated : Aug 9, 2019, 5:01 PM IST