తెలంగాణ

telangana

శివనామస్మరణలతో మార్మోగుతున్న గోదావరి

By

Published : Mar 11, 2021, 1:39 PM IST

రాష్ట్రంలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం ఆలయాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Godavari river  overflows with devotees the occasion of Mahashivaratri
శివనామస్మరణలతో మార్మోగుతున్న గోదావరి

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలోని గోదావరి నది... భక్తుల శివనామస్మరణలతో మార్మోగుతుంది. తెల్లవారు జామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం నది తీరంలోని గౌతమేశ్వరాలయంలో గల శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివలింగానికి నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు.

భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కర ఘాట్‌లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details