Ganja Smuggling in Telangana :తెలంగాణలో సరిహద్దు జిల్లాలు గంజాయి అక్రమ రవాణాకు అడ్డాలుగా మారుతున్నాయి. పోలీసులకు కంటపడకుండా ఉండేందుకు స్మగ్లర్లు రవాణాకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్నారు. తాజాగా ఇటుకలలోడ్ మాటున గంజాయి(Ganja Smuggling) అక్రమ రవాణా చేస్తున్న ముఠాను మంచిర్యాల జిల్లా పోలీసులు(Manchirial District Police) అరెస్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా ఇటుకలలోడ్ మాటున ట్రాక్టర్లో గంజాయి తరలిస్తున్న ముఠాను శ్రీరాంపూర్ పోలీసులు పట్టుకున్నారు.
Hyderabad Ganja Gang Arrested : హైదరాబాద్‌లో గంజాయి గ్యాంగ్ అరెస్ట్.. నిందితుల్లో మైనర్
Mancherial Latest News :స్మగ్లర్లు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ట్రాక్టర్లో సిమెంట్ ఇటుకలను తరలిస్తున్నట్లుగా ఏర్పాట్లు చేసి.. అందులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు రామగుండం సీపీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన నిందితులు.. అక్కడి చుట్టు పక్కల గ్రామాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు.
గంజాయిని తరలిస్తుండగా మార్గ మధ్యలో.. 23వ తేదీ రాత్రి వేళ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి జీఎంకార్యాలయం వద్ద ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపైనే నిలిపేసినట్లు సీపీ పేర్కొన్నారు. రాత్రివేళ విధుల్లో ఉన్న మంచిర్యాల ఎస్సై.. పరిశీలించగా ఇటుకలలో గంజాయి దొరికినట్లు తెలిపారు. మొత్తంగా 465 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం స్పెషల్ టీమ్‌గా ఏర్పడి.. ఒడిశాలోని మల్కాన్‌గిరిలో పర్యటించగా.. స్థానిక పోలీసుల సహకారంతో అసలు రహస్యం బహిర్గతమయినట్లుగా తెలిపారు.