తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - గాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల

మంచిర్యాలలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యే దివాకర్ రావు మహాత్ముని విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం దేశ రెండో ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించారు.

మంచిర్యాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మంచిర్యాలలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2020, 4:18 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్క్​లో మున్సిపల్ ఛైర్మన్ రాజయ్య ఆధ్వర్యంలో పూలతో వైభవంగా ముస్తాబు చేశారు.

మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎమ్మెల్యే దివాకర్ రావు గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం దేశ రెండో ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రికి నివాళులర్పించారు. విపత్కర సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు తోడ్పాటును అందించాలని అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గాంధీ కలలను కేసీఆర్ సాకారం చేస్తున్నారు: పోచారం

ABOUT THE AUTHOR

...view details