అక్షయ తృతీయ పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో బంగారు నగల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆభరణాలపై డిస్కౌంట్లు ప్రకటించారు. అక్షయ తృతీయ రోజు పసిడి కొనుగోలు చేస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే ప్రజలు జువెలరీ షాపులకు బారులు తీరారు.
మంచిర్యాలలో కిటకిటలాడిన బంగారం దుకాణాలు - gold shops
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సిరిసంపదలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. అందుకే ఈరోజు పసిడి కొనుగోలు చేసేందుకు మంచిర్యాలలో ప్రజలు బారులు తీరారు.
పసిడి కొనుగోలు
ఇవీ చూడండి: డాజిల్ స్పోర్ట్స్ వేర్ ఎలా వచ్చిందంటే..?