మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియా గాంధీ నగర్లో శుక్రవారం అర్ధ రాత్రి మద్యం మత్తులో ముగ్గురు యువకులు వీరంగం సృష్టించారు. పాత కక్షలతో శ్రీనివాస్ అనే వ్యక్తిని యువకులు కత్తితో పొడిచారు.
పాత కక్షలతో వ్యక్తిపై యువకుల హత్యాయత్నం - four tried to kill one in mancherial district
మద్యం మత్తులో ముగ్గురు యువకులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్యకు యత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం గాంధీనగర్లో చోటుచేసుకుంది.
![పాత కక్షలతో వ్యక్తిపై యువకుల హత్యాయత్నం four boys tried to kill a person in mancherial district with old grudge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7218477-1043-7218477-1589605673205.jpg)
పాత కక్షలతో వ్యక్తిపై యువకుల హత్యాయత్నం
గమనించిన స్థానికుడు పోలీసులకు సమాచారమందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుణ్ని ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు యువకుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు శ్రీరాంపూర్ ఎస్సై మంగీలాల్ తెలిపారు.