అటవీశాఖ అధికారులపై వేటు - PEDDAPULI
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు బలైన పెద్దపులి కేసులో అక్కడి ఇంచార్జ్ బీట్ అధికారి జ్యోతిని సస్పెండ్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో... ఎంతటి అధికారులైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అడవికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జైపూర్ మండలంలోని శివ్వారంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు బలైన పెద్దపులి కేసులో అక్కడి ఇంచార్జ్ బీట్ అధికారి జ్యోతిని సస్పెండ్ చేశారు. ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి బాలకృష్ణకు చార్జీ మెమో ఇచ్చారు. రంగపేటలో వేటగాళ్ల ఉచ్చుకు బలైన చిరుత పులి కేసులో సెక్షన్ అధికారి చంద్రమోహన్, బీట్ అధికారి సంతోష్‌కు చార్జ్ మెమోలు జారీ చేశారు.
వన్యప్రాణుల సంరక్షణలో... ఎంతటి అధికారులైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అడవికి హాని కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.