తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంపేట్‌లో అన్నదానం.. వడ్డించిన ఎమ్మెల్యే వివేకానంద - ప్రగతినగర్‌, మిథిలానగర్‌లో అన్నార్తుల ఆకలి తీరుస్తున్న మద్దు సురేశ్‌

మేడ్చల్‌ జిల్లా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతినగర్,​ మిథిలానగర్‌లో మద్దు సురేశ్‌ అనే వ్యక్తి పేదలకు భోజనం పంపిణీ చేసి దాతృత్వం చాటుతున్నారు.

food distribution in pragathinagr and mithila nagar nizampet hyderabad
నిజాంపేట్‌లో అన్నదానం

By

Published : May 4, 2020, 5:22 PM IST

మేడ్చల్‌ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌, మిథిలానగర్‌లో మద్దు సురేశ్‌ అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. ఆదివారం జరిగిన అన్నదాన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పాల్గొని భోజనం వడ్డించారు. కూలీలకు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.

ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి ఉదయం, సాయంత్రంసుమారు 800 వందల పేదలు, కూలీలకు భోజనం అందిస్తున్నారు. పొట్టకూటి కోసం వచ్చిన కూలీలకు అన్నదానం చేస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.

ఇదీ చూడండి:గంజ్‌ కారణంగానే వనస్థలిపురంలో కొవిడ్‌ కేసులు

ABOUT THE AUTHOR

...view details