లాక్డౌన్ వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కొవిడ్ బాధితులు, వారి బంధువులు ఆహారం దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అన్నదానం నిర్వహించారు. కొవిడ్ సంక్షోభంలో 14 రోజుల నుంచి పేదలను ఆదుకుంటున్నట్లు ఆయన వివరించారు.
ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, బంధువులకు అన్నదానం - మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి
మంచిర్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నదానం నిర్వహించారు. ఆపత్కాలంలో రాజకీయాలకు అతీతంగా 14 రోజుల నుంచి పేదలను ఆదుకుంటున్నట్లు ఆయన వివరించారు. మానవతావాదులంతా ముందుకొచ్చి.. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తోన్న పేదలకు అండగా నిలవాలని ఆయన కోరారు.
food distribution
అన్నదానంతో పాటు.. వీధుల్లో శానిటైజేషన్, కరోనా బాధితులకు మెడికల్ కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందించినట్లు ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అన్నదాతల ఆందోళన.. భారీగా నిలిచిన వాహనాలు