తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజాసమస్యలు తీర్చేందుకు ఎల్లవేళలా ముందుంటాం' - తాగునీటి వార్తలు

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వేసవిలో నీటి ఎద్దడిని తీర్చేందుకు ఐదు వాటర్ ట్యాంక్​లను సిద్ధం చేశామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్​రావు తెలిపారు. ప్రజాసమస్యలు తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని పేర్కొన్నారు.

five water tankers inaugurated by mancherial mla diwakar rao
'ప్రజాసమస్యలు తీర్చేందుకు ఎల్లవేళల ముందు ఉంటాం'

By

Published : Apr 4, 2021, 3:12 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కొరతను తీర్చేందుకు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్​రావు మంచినీటి ట్యాంకర్లను ప్రారంభించారు. వేసవి కాలంలో మున్సిపాలిటీ పరిధిలో నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉన్నందున.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.

గతేడాది నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశామని... కాలనీ వాసులకు మరింత కొరత ఉండటం వల్ల ఈ సారి ఐదు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాసమస్యలు తీర్చేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:యాదాద్రీశుని ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details