తెలంగాణ

telangana

ETV Bharat / state

mancherial man murdered: పథకం ప్రకారమే మంచిర్యాల యువకుడి మర్డర్ - ఇందారంలో వ్యక్తి హత్య

mancherial man murdered: సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని హత్య చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

mancherial man murdered
మంచిర్యాల యువకుడి మర్డర్ కేస్.. ఐదుగురు అరెస్ట్

By

Published : Apr 27, 2023, 3:07 PM IST

mancherial man murdered: మంచిర్యాల జిల్లా ఇందారంలో ఇటీవల పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా హత్యచేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మృతుడు మహేశ్‌ను చంపిన కనకయ్యతో పాటు అతని భార్య, కుమారుడు, కుమార్తెలను నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ తెలిపారు. జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతితో మహేశ్‌ అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గతేడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న మహేశ్‌.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ వీడియోలను చూసిన యువతి భర్త... ఆరునెలల క్రితం విడాకులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో యువతి తన పుట్టింటికి వచ్చింది. అయినా పలుమార్లు యువతిని మహేశ్‌ వేధిస్తూ వచ్చాడు. కుటుంబసభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినా.... వేధింపులు కొనసాగుతుండటాన్ని భరించలేకపోయారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టికోవట్లేదని కోపంతో బాధిత యువతి కుటుంబీకులు కక్ష పెంచుకున్నారు. మృతుడు ఉదయం పాలు పోసి వస్తుండగా.. అడ్డగించి కత్తితో పొడిచి, బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనేఈ నెల 23న (మంగళవారం) ఉదయం మహేశ్‌పై కత్తి, బండరాళ్లతో యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి హతమార్చార్చినట్లు ఏసీపీ నరేందర్‌ తెలిపారు.

"ఉదయం పూట ఎనిమిదిన్నర గంటల సమయంలో బండరాళ్లతో కొట్టి చంపారు. ఆరోజే కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము. ఈరోజు ఉదయం ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని అరెస్టు చేశాము. వాళ్లు నేరం ఒప్పుకున్నాక వారి దగ్గరున్న సెల్​ఫోన్, కత్తిని సీజ్ చేశాము. మహేశ్, శృతిల మధ్య కొన్ని రోజులు ప్రేమాయణం సాగింది. వేరే వ్యక్తితో శృతికి పెళ్లైన తర్వాత కూడా వీరి మధ్య సంబంధం కొనసాగింది. కొద్ది రోజుల తర్వాత మహేశ్ ప్రవర్తన బాగోకపోవడం వల్ల ఆమె అతనికి దూరంగా ఉన్నది. ఈ కోపంతో మహేశ్ వీరు దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. దీంతో వీరి విషయం శృతి భర్తకు వారికి సంబంధించిన బంధువులందరికీ తెలవడంతో ఆమె భర్త సూసైడ్ చేసుకున్నాడు. మహేశ్ వారి ఫోటోలను బయటపెట్టడం, వద్దన్నా కూడా వెంటపడటం, కొన్ని గొడవలు జరగటం వల్ల మహేశ్ మారేలా లేడని పథకం ప్రకారం అతను పాలు పోసి వస్తుండగా కుటుంబం అంతా కలిసి అతడిని రాళ్లతో కొట్టి చంపేశారు."_నరేందర్, జైపూర్‌ ఏసీపీ

మంచిర్యాల యువకుడి మర్డర్ కేస్.. ఐదుగురు అరెస్ట్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details