తెలంగాణ

telangana

ETV Bharat / state

వారికి రూ.1500 జరిమానా వేశారు.. ఎందుకో తెలుసా? - గ్రామాభివృద్ధి

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం రసూల్​పల్లిలో ఇంటి ముందు చెత్త వేసినందుకు ఒక్కొక్కరికి రూ.ఐదు వందల చొప్పున ముగ్గురికి అధికారులు జరిమానా వేశారు.

ఇంటి చెత్త బయట వేసినందుకు జరిమానా

By

Published : Sep 15, 2019, 1:56 PM IST

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అధికారులు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అవి పాటించని వారికి వెంటనే జరిమానా విధిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ముదిగుంట పంచాయతీ రసూల్​పల్లిలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లో ఉన్న చెత్తడబ్బాను వాడలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇంటి ముందున్న రోడ్డుపైన చెత్త వేశారు. ఫలితంగా శంకరమ్మ, బండి స్వర్ణకార్, కనకయ్యలకు ఒక్కొక్కరికి రూ.ఐదు వందల చొప్పున జరిమానా విధించినట్లు ఎంపీడీవో నాగేశ్వర్​రెడ్డి, కార్యదర్శులు రామకృష్ణ, శివకృష్ణ వివరించారు.

ఇంటి చెత్త బయట వేసినందుకు జరిమానా

ABOUT THE AUTHOR

...view details