పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ విడుదల సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు సాయమందించినట్లు మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మహేశ్ తెలిపారు. పాఠశాలల మూసివేతతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు రూ.5 వేల సాయం అందించినట్లు పేర్కొన్నారు.
జనసేన తరఫున ప్రైవేట్ టీచర్లకు ఆర్థిక సాయం - మంచిర్యాల జిల్లా సమాచారం
వకీల్ సాబ్ విడుదల రోజునే జనసేన నాయకులు ఔదార్యం ప్రదర్శించారు. పాఠశాలల మూసివేతతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పదిమందికి ఆర్థికసాయం అందించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేట్ టీచర్లకు సాయం
సహాయ స్వచ్ఛంద సంస్థ, శారద నారాయణ దాస్ సేవా సంస్థల సహకారంతో పదిమందిని ఆదుకున్నామని మహశ్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, స్వచ్ఛందసంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.