తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.30 కోసం కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న తండ్రి - మంచిర్యాల జిల్లా వార్తలు

మద్యానికి బానిసైన ఓ తండ్రి రూ.30 కోసం కన్న కొడుకు గొంతు కోశాడు. తగడానికి డబ్బులు ఇవ్వలేదనే కొపంతో కుమారుడిని చంపడానికి కూడా వెనకాడలేదు ఆ కసాయి తండ్రి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారంలో చోటు చేసుకుంది.

father killed her son for drink liquor in manchiryal
రూ.30 కోసం కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న తండ్రి

By

Published : Sep 4, 2020, 11:02 PM IST

తాగుడుకు బానిసైన తండ్రి తన ఒక్కగానొక్క కుమారుడిని దారుణంగా హత్యచేశాడు. కేవలం రూ.30 కోసం కన్నబిడ్డను కత్తితో గొంతు చేసి చంపేశారు. నలుగురు కూతుళ్లు తర్వాత జన్మించిన కొడుకుని చూసుకోవాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం పంచాయతీ పరిధిలోని గోంగూడకు చెందిన కారి, తన కుమారుడు గంగూను(25) కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.

శుక్రవారం సాయంత్రం సమయంలో మద్యం తాగేందుకు కుమారుడిని కారి డబ్బులు అడిగాడు. అందుకు గంగు ససేరిమా అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నా గంగుపై.. కారి దాడి చేశారు. కత్తితో గొంతు కోశాడు. దీంతో గంగు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details