తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్న తండ్రి చావుకు రానివ్వని కరోనా - corona latest news

కరోనా కన్న తండ్రిని చివరిసారిగా చూసుకోనివ్వకుండా చేసింది. ఇంటికి రాలేక ఇద్దరు కుమారులు దుబాయ్ నుంచి వాట్సాప్ వీడియో కాలింగ్ ద్వారా తమ తండ్రి అంత్యక్రియలు చూసి కన్నీరుమున్నీరైన ఘటన మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో జరిగింది.

Father Funeral Watch Whatsup in manchiryala district
కన్న తండ్రి చావు రానివ్వని కరోనా

By

Published : May 5, 2020, 8:32 PM IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన ఎర్రం సత్తయ్య (55) అనారోగ్యంతో చనిపోయాడు. కర్మకాండలు చేయాల్సిన ఇద్దరు కొడుకులు మల్లేశ్​, అంజి ఇద్దరూ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్​డౌన్ వల్ల అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రావడానికి వీలు లేని కారణంగా చేసేది ఏమి లేక వీడియో కాల్ ద్వారా తండ్రి చివరి చూపు చూశారు.

ABOUT THE AUTHOR

...view details