తెలంగాణ

telangana

ETV Bharat / state

'పంట ఎండుతోంది.. సాగునీరు అందించండి'

ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట.. నీరు లేక కళ్ల ముందే ఎండిపోతోందని మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. రాస్తారోకో నిర్వహించారు.

By

Published : Apr 8, 2021, 4:02 PM IST

farmers problems
సాగునీటి కష్టాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామ రైతులు రోడ్డెక్కారు. కడెం ప్రాజెక్టును నమ్మి పంట సాగు చేస్తే.. తీరా చేతికొచ్చే దశలో నీరు అందక పంట ఎండిపోయే స్థితికి చేరిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు ముందు నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం.. ఏప్రిల్ నెల చివరి వరకు కడెం నుంచి నీరు ఇవ్వాల్సి ఉండగా.. నీటిమట్టం లేదనే సాకుతో పంటను ఎండబెడుతున్నారని రైతులు మండిపడ్డారు. నష్టపోతే.. తమకు చావే దిక్కని వాపోయారు. కనీసం.. గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం నుంచి అయినా.. సాగునీరు అందించి తమ బాధలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:తెరాసకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం... కాంగ్రెస్ అభ్యంతరం

ABOUT THE AUTHOR

...view details