మంచిర్యాల జిల్లా భీమారం మండలం మద్దికల్కు చెందిన రైతులకు సంబంధించిన 32 ఎకరాల భూమి అక్రమంగా కొందరు పట్టాలు చేసుకున్నారని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రైతుల కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నరహరి మాణిక్యమ్మ నుంచి సంక్రమించిన భూమిని 70ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. రెండేళ్ల క్రితం తహసీల్దార్ కార్యాలయం ముందు 150 రోజులు నిరసన తెలిపగా... ఆర్డీవో న్యాయస్థానానికి పంపారని తెలిపారు. ఇప్పటికీ తీర్పు రాలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం సతీష్ రైతులకు నచ్చ చెప్పి ఆందోళన విరమింపచేశారు.
భూమి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు - manchirial
తమ భూమిని అక్రమంగా పట్టాలు చేసుకున్నారంటూ... మంచిర్యాల జిల్లా మద్దికల్కు చెందిన రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. రైతుల కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
భూమి కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు