పెట్టిన పెట్టుబడి కూడా రాలేదనే దిగులుతో మరో అన్నదాత తనువు చాలించాడు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జక్కాపూర్కు చెందిన మేడి శ్రీనివాస్(40) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో మూడెకరాల తన సొంత పొలంతో పాటు... మరో మూడు ఎకరాల్లో వరి, పది ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంటపై సుమారు నాలుగు లక్షల పెట్టుబడి పెట్టాడు.
దిగుబడి రాలేదన్న దిగులుతో రైతు ఆత్మహత్య - jakkapur latest news
భూమినే నమ్ముకున్నాడు. తన పొలంతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. పెట్టుబడి పెట్టాడు. ఆరుగాలం కష్టపడ్డాడు. కానీ... ఆ రైతు కష్టాన్ని అకాల వర్షాలు నీటిపాలు చేశాయి. అప్పుల ఊబి నుంచి బయటపడలేనేమోనన్న భయంతో బలవంతంగా తనువు చాలించేలా చేశాయి.

farmer suicide at jakkapur
అకాల వర్షాలకు పత్తి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పెట్టిన పెట్టుబడి పూర్తిగా నీటిపాలైందని దిగులు మొదలైంది. తాను చేసిన అప్పుల నుంచి కోలుకోలేమోననే భయంతో... ఆ రైతు బలవంతంగా తనువు చాలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు.