మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో ఎద్దును ద్విచక్ర వాహనం ఢీకొని కొమ్ముగూడెం మాజీ ఉపసర్పంచ్ మృతి చెందారు. లక్షెట్టిపేట మండలంలోని చందారం గ్రామం నుంచి తిరిగి కొమ్ముగూడెం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మాజీ ఉపసర్పంచ్ బుద్దె రాజన్న ఎద్దును ఢీకొట్టడం వల్ల తలకు తీవ్ర గాయమైంది.
ఎద్దును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం... మాజీ ఉపసర్పంచ్ మృతి
ఎద్దును ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో మాజీ ఉపసర్పంచ్ మృతి చెందిన విషాద సంఘటన మంచిర్యాల జిల్లా చందారంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎద్దును ఢీకొట్టిన ద్విచక్రవాహనం... మాజీ ఉపసర్పంచ్ మృతి
తీవ్ర రక్తస్రావం కావడం వల్ల అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: భార్య సమాధి వద్దే ఉరివేసుకుని భర్త ఆత్మహత్య...