మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని బాబా నగర్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జిల్లా పాలనాధికారిణి భారతి హోళీ కేరి హాజరై...100 మంది గిరిజనులకు నిత్యావసర సరకులను అందజేశారు. ప్రతి ఒక్కరూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం కోసం స్వీయ నిర్బంధం పాటించాలని కలెక్టర్ సూచించారు.
గిరిజనులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన కలెక్టర్ - గిరిజనులకు నిత్యావసరాలను పంపిణీ
కరోనా నియంత్రణకు స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ మాస్క్ ధరించటం,భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Manchiryal district latest news
మారుమూల ప్రాంతాలలో సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు,గిరిజనులను ఆదుకోవాలనే ఉద్దేశంతో గెజిటెడ్ అధికారులు అందిస్తున్న సహకారానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.