తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీర్​ కాదు ఇంటిదొంగ - engineer thief at mancheriyala

అతనో ఇంజినీర్..కానీ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. బంధువుల ఇళ్లల్లో చోరీలు చేశాడు. చిన్న ఘటన అతన్ని పట్టించింది.

ఇంజినీర్​ కాదు ఇంటిదొంగ

By

Published : Oct 26, 2019, 7:06 PM IST

కరీంనగర్​కు చెందిన శ్రీకాంత్ ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజినీర్. అదే గ్రామంలో బంధువులకు సంబంధించిన రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంజనీర్​ శ్రీకాంత్​ బండారం బయటపడింది.

ఇంజినీర్​ కాదు ఇంటిదొంగ
అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో దొంగిలించిన ద్విచక్ర వాహనంపై జరిమానా పడినట్లు యజమానికి తెలిసింది. అప్రమత్తమైన వాహన యజమాని పోలీసులకు సమాచారం అందించగా... మంచిర్యాల పోలీసులు శ్రీకాంత్​ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీసీపీ రక్షితా కృష్ణామూర్తి తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించగా... అతని వద్ద నుంచి 32 కిలోల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details