మంచిర్యాల జిల్లాకేంద్రంలో ఎడ్ల పందేలు - edla pandelu
మాజీ శాసనసభ్యుడు గోనె హనుమంతరావు స్మారకార్థం మంచిర్యాలలో ఎడ్ల పందేలు నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

హనుమంతరావు స్మారకార్థం మంచిర్యాలలో ఎడ్ల పందేలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎడ్ల పందేలను నిర్వహించారు. పాత మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్ నుంచి గోదావరి రోడ్డు వరకు పోటీలను నిర్వహించారు. దివంగత మాజీ శాసనసభ్యుడు గోనె హనుమంతరావు స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ఎమ్మెల్యే దివాకర్ రావు బహుమతులను ప్రదానం చేశారు. ప్రాచీన కళలను ప్రోత్సహించే విధంగా కృషి చేసిన వారిని చూస్తే తనకు ఆనందంగా ఉందని విజేత వెంకట్రావు తెలిపారు.
హనుమంతరావు స్మారకార్థం మంచిర్యాలలో ఎడ్ల పందేలు