ప్రతి గ్రామ పంచాయతీలో కంపోస్ట్ షెడ్డు, డంపింగ్ యార్డులను తప్పని సరిగా ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల శాసనసభ్యుడు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల పరిధిలోని 9 గ్రామాల్లో నూతనంగా నిర్మించిన కంపోస్ట్ షెడ్డులను ఆయన ప్రారంభించారు.
ముల్కల్ల హైవేపై కల్వర్టు, సైడ్ డ్రైన్‌కు శంకుస్థాపన చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి తెరాస ప్రభుత్వం ప్రతి పంచాయతికీ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి అందజేసిందన్నారు.