తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా కండక్టర్​పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం - rtc strike in telangana

తాత్కాలిక మహిళా కండక్టర్​తో​ అసభ్యంగా ప్రవర్తించిన తాత్కాలిక డ్రైవర్​పై  కేసు నమోదయిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​లో చోటుచేసుకుంది.

నిందితుడు శ్రీనివాస్​

By

Published : Oct 18, 2019, 8:35 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శ్రీనివాస్​ అనే వ్యక్తి తాత్కాలిక డ్రైవర్​గా విధుల్లో చేరి మంచిర్యాల డిపో ఆర్టీసీ బస్సు నడుపుతున్నాడు. గురువారం రాత్రి తాత్కాలిక మహిళా కండక్టర్​, ప్రయాణికులతో కలిసి మంచిర్యాల నుంచి బస్సు చెన్నూర్ బయలుదేరింది. అక్కడ ప్రయాణికులను దించి తిరిగి వస్తుండగా బస్సు చెడిపోయింది. ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. బస్సులో డ్రైవర్, కండక్టర్ ఇద్దరే మిగిలారు. మహిళా కండక్టర్​పై దురాలోచన చేసిన శ్రీనివాస్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. భయపడిన ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఇంటికెళ్లాక జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు జైపూర్​కు వెళ్లి పోలీస్​ స్టేషన్​ ఫిర్యాదు చేశారు. పోలీసులు డ్రైవర్​ శ్రీనివాస్​ను అరెస్ట్​ చేసి సెక్షన్ 354 కేసు నమోదు చేశారు.

మహిళా కండక్టర్​పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచారయత్నం

ABOUT THE AUTHOR

...view details