రామగుండం సీపీ సత్యనారాయణ దత్తత గ్రామమైన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కొలంగూడలో గిరిజన ప్రజలకు నూతన వస్త్రాలు అందించారు. దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులు ధరించి.. గిరిజనులు ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు దుస్తులు పంపిణీ చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు.
'మీ పిల్లలను చదివించండి.. మీ జీవితాల్లో వెలుగు నింపుకోండి' - Ramagundam cp satyanarayana
దసరా పండుగను పురస్కరించుకుని రామగుండం సీపీ సత్యనారాయణ దత్తత గ్రామం మంచిర్యాల జిల్లా కొలంగూడ గ్రామంలో గిరిజనులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కొత్త బట్టలు ధరించి.. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఐ కుమారస్వామి తెలిపారు.
కొలంగూడ గ్రామంలో పేదలకు దుస్తుల పంపిణీ
చదువుకోవడం వల్ల ప్రయోజనాలు గురించి వివరిస్తూ సీఐ కుమారస్వామి గిరిజనులలో చైతన్యం నింపారు. మద్యం, నాటుసారాకు బానిసలై కుటుంబాలను రోడ్డున పడేసుకోవద్దని సూచించారు. పిల్లలను చదివిస్తూ జీవితాల్లో వెలుగునింపుకోవాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అసంఘటిత శక్తులు చొరబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
- ఇదీ చదవండి : 'వదంతులు నమ్మకండి.. నాన్న ఆరోగ్యం స్థిరంగా ఉంది'