తెలంగాణ

telangana

ETV Bharat / state

మా భూముల జోలికి రావద్దు... - GOVERNMENTB SHOULD PROTECT OUR LANDS

మంచిర్యాల జిల్లా భీమిని మండలం ఖర్జీ భీంపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూముల జోలికి రావొద్దని అటవీ అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు

By

Published : Feb 9, 2019, 7:20 AM IST

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు
అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. తమ భూముల చుట్టూ అక్రమంగా కందకాలు తవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. తమ భూములను ప్రభుత్వమే రక్షించి న్యాయం చేయాలని కోరారు. భూములు ఖాళీ చేయకపోతే కేసులు పెడతామని అధికారులు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details