విపత్కర సమయంలో ప్రజల భవిష్యత్తు కోసం వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. 104, 108 సిబ్బందికి తమ వంతు సాయంగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.
వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ల పంపిణీ - నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్క్లు పంపిణీ
నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 108, 104 సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటున్న వారికి తమవంతు సాయం చేస్తున్నామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణి
కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా ప్రతి ఒక్కరూ సహాయపడాలని, స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేస్తూ కరోనా బాధితులకు సహకారం అందిస్తున్న సిబ్బందికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే దివాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.