లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మార్వాడీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. కాలనీలో నివసిస్తున్న సుమారు 120 నిరుపేద కుటుంబాలకు కిరాణా సరకులు అందజేశారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కూలీలకు మార్వాడీ ప్రగతి సమాజ్ ముందుకు వచ్చి వారిని సరకులు ఇవ్వడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు ఎమ్మెల్యే దివాకర్ రావు.
కూలీలకు సరకులు పంపిణీ చేసిన మార్వాడీ ప్రగతి సమాజ్ - సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలనీల్లో మార్వాడీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో కిరాణా సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలకు నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే దివాకర్ రావు అందించారు.
మంచిర్యాలలో నిత్యావసర వస్తువులు పంపిణీ
పేదలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాము ముందుంటామని మార్వాడీ ప్రగతి సమాజ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజ్ మోహన్ రేణ్వా తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలకు, నిరుపేద కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న కరోనా.. 33వేలు దాటిన మృతులు
TAGGED:
MARWADI SAMAJ SAYAM