తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రగతిలో వినూత్న ఆలోచన.. టైర్లలో మొక్కల రక్షణ - టైర్లకు రంగులు

మంచిర్యాలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలు నూతన ఆలోచన చేశారు. కార్యక్రమంలో పనికిరాని వస్తువులను పారేయకుండా వాటిపై వివిధ ఆకృతులతో బొమ్మలు గీశారు. టైర్లకు రంగులు అద్ది మొక్కలు నాటారు. వీరి ఆలోచన చూసిన మిగిలిన పట్టణ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

different plantation idea in pattana pragathi program in manchiryala
పట్టణ ప్రగతిలో వినూత్న ఆలోచన.. టైర్లలో మొక్కల రక్షణ

By

Published : Mar 5, 2020, 2:07 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పట్టణ ప్రగతి వినూత్న రీతిలో సాగుతోంది. నగరంలోని యువత పనికిరాని వస్తువులపై ఆలోచింపజేసే అందమైన బొమ్మలు గీశారు. మరికొన్ని వస్తువుల్లో మొక్కలు పెంచుతూ పచ్చదనాన్ని నింపుతున్నారు.

పనికిరాని టైర్లకు రంగులు వేసి అందులో పూల మొక్కలను నాటారు. పట్టణంలోని టేకుల బస్తీ, ఏఎంసీ ఏరియాలోని ప్రజల చేసిన ఈ ఆలోచనలు చూసి అధికారులు మెచ్చుకుంటున్నారు. కాలనీలోని పాత గోడలకు ఆలోచింపజేసేలా చిత్రాలను వేశారు.

ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆ గోడలను చూసి చుట్టుపక్కల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ ప్రగతిలో వినూత్న ఆలోచన.. టైర్లలో మొక్కల రక్షణ

ఇవీచూడండి:'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'

ABOUT THE AUTHOR

...view details