మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో డీసీపీ రక్షిత నేతృత్వంలోని 61 మంది పోలీస్ బృందం ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో అక్షరాస్యత లేని వారు ఎక్కువగా ఉన్నారని నూతన వాహన చట్టానికి సంబంధించిన అవగాహన కల్పించి తమకు లైసెన్సులు ఇప్పించాలని కాలనీలోని వాహనదారులు కోరారు. ప్రజలతో మమేకమై ఉండడానికే పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తమ సమస్యలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కు రావటానికి భయపడే వారి కోసమే ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నామని రక్షిత కృష్ణమూర్తి తెలిపారు.
పోలీసుల నిర్బంధ తనిఖీలు... వాహనం చట్టంపై అవగాహన - vehicles Possession
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్లోని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నేతృత్వంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే సోదాలు నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
పోలీసుల నిర్బంధ తనిఖీలు... వాహనం చట్టంపై అవగాహన