తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్... ఒకరు మృతి - one man die

పత్తి తీసేందుకు పెద్దతుంబళం నుంచి బెల్లంపల్లికి కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఇందారం రైల్వే వంతెన వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.

dcm van hits lorry, one man die, 8 members injured
లారీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్... ఒకరు మృతి

By

Published : Dec 14, 2019, 9:13 AM IST

మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం రైల్వే వంతెన వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్, లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు కర్నూలు జిల్లా వాసి హనుమంతుగా గుర్తించారు. క్షతగాత్రులను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వ్యాన్​లో 31 మంది పత్తి కూలీలు ఉన్నారు.

లారీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్... ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details