తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాసకు కాదు ఆర్టీసీ కార్మికులకు మా మద్దతు...' - CPI FULL SUPPORT TO TSRTC STRIKE

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తెలిపారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో తెరాసకు తెలిపిన మద్దతును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

CPI CHADA VENKATREDDY ON TSRTC STRIKE AND TRS SUPPORT IN HUZURABAD ELECTIONS

By

Published : Oct 13, 2019, 11:40 PM IST

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి ప్రకటించారు. మంచిర్యాలలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను చాడ కలిశారు. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతిస్తున్నట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. సమ్మెతో సీఎం కేసీఆర్​కు చీమకుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి చూస్తున్నారన్నారు. 48 వేల మంది కార్మికులను విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించడంతోనే మనోవేదనకు గురై ఆర్టీసీ కార్మికులు ప్రాణ త్యాగాలకు సైతం పాల్పడుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఆర్టీసీని సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎన్నికలలో సరైన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.

'తెరాసకు కాదు ఆర్టీసీ కార్మికులకు మా మద్దతు...'

ABOUT THE AUTHOR

...view details