మంచిర్యాల జిల్లా హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట బాధితులు రాస్తారోకో నిర్వహించారు. కొవిడ్ లక్షణాలతో వచ్చిన తమకు నిర్ధరణ పరీక్షలు చేయడం లేదంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు.
నాలుగు రోజుల నుంచి ఆసుపత్రి చుట్టూ తిరిగినా టెస్టులు చేయడం లేదని.. కేవలం 10, 20 మందికే నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. టెస్ట్ కిట్లు లేవని చెప్తూ.. కొవిడ్ బాధితుల పట్ల సిబ్బంది నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి క్వారంటైన్ సమయం అయిపోయిన తర్వాత మళ్లీ టెస్టులకు వెళ్తే నిరాకరిస్తున్నారని తెలిపారు.