మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఊపందుకున్నాయి. సోమవారం వరకు నామమాత్రంగా చేసిన పరీక్షలు సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ప్రతి రోజు రెండు వందల మంది సింగరేణి కార్మికులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మంగళవారం 126 మంది సింగరేణి కార్మికులకు పరీక్షలు నిర్వహించగా... 26 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు ప్రసన్న కుమార్ ప్రకటించారు.
సింగరేణి ఏరియాలో రోజుకు 200 కరోనా పరీక్షలు
సింగరేణిలో కూడా రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరిగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో రోజుకు 200 మంది సింగరేణి కార్మికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
సింగరేణి ఏరియాలో రోజుకు 200 కరోనా పరీక్షలు
ఆసుపత్రిలో బాధితులకు చికిత్సకోసం చేసిన ఏర్పాట్లను సింగరేణి డైరెక్టర్ బలరాం, మందమర్రి ఏరియా జీఎం శ్రీనివాస్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ పరిశీలించారు. డీవైసీఎం ఉషారాణి నుంచి వివరాలు తెలుసుకొని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ పరీక్షలు చేసుకోగా నెగిటివ్ వచ్చింది.
ఇవీ చూడండి: వైద్యశాఖలో లోపాలు బయటకు వస్తాయనే: భట్టి