ఒకరితో మొదలైన కరోనా ప్రస్తుతం 56 మందికి సోకి గ్రామాన్ని అతలాకుతలం చేస్తోంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేను గ్రామంలోని రేగులగూడెంలో 80 ఆదివాసీ కుటుంబాలు.. 200 మంది జనాభా ఉంటారు. ఇటీవల కొందరు ఓ వేడుకకు వెళ్లివచ్చారు. కొన్ని రోజులకు ఒకరిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే 56 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. నిత్యావసర సరకులు, తాగునీటి కోసం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆ గూడెంలో 200 జనాభా.. 56 మందికి కరోనా - కరోనా తాజా వార్తలు
జిల్లాల్లో కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఎంత వేగంగా అంటే 200 జనాభా ఉన్న గూడెంలో ఏకంగా 56 మందికి కొవిడ్ సోకింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో వైరస్ ఎలా విస్తరిస్తోందో.

కరోనా