కరోనా లాక్డౌన్ సమయంలో పలువురు రచయితలు, కవులు, గాయకులు... తమ ప్రతిభతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో అచ్చాలపూర్ గ్రామానికి చెందిన చిన్నారులు శ్రీహర్ష, శ్రీవల్లి వైద్యులపై అవగాహన కల్పిస్తూ... వారి సేవలను కొనియాడుతూ పాట పాడారు.
'తల్లి కన్నా... దేవుడికన్నా... వైద్యుడి త్యాగం గొప్పది'
జయహో జయహో ఓ వైద్యుడా... చెయ్యెత్తి జై కొట్టు భారతీయుడా అంటూ తాండూరులో చిన్నారులు పాడుతున్నారు. వైద్యుల సేవలపై... ఆ చిన్నారుల ఆలపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.
'తల్లి కన్నా... దేవుడికన్నా... వైద్యుడి త్యాగం గొప్పది'
నవమాసాలు మోసే తల్లికన్నా... గోపురాన కొలువైన దేవుడి కన్నా... నీ త్యాగం ఎంతో మిన్నా అంటూ వైద్యుల సేవలను పాట రూపంలో వివరించారు.
ఇవీచూడండి:'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'