చెరువులోని సారవంతమైన మట్టిని మొరం పేరుతో ఇటుక బట్టీలకు తరలిస్తున్నానరని ఆయకట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ చెరువు పూడికతీత వివదాస్పదంగా మారింది. ఆయకట్టు క్రింద మండలంలోని గుడిరేవు, అల్లీపూర్ గ్రామాలుండగా.. అల్లీపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గుడిరేవు రైతులకు సమాచారం ఇవ్వకుండానే చెరువులో పూడిక తీసివేయాలని నిర్ణయంచారు. విషయం తెలుసుకున్న మంచిర్యాలకు చెందిన ఓ మట్టి వ్యాపారి రంగంలోకి దిగి స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మట్టి తరలింపునకు అనుమతులు తెచ్చుకుని వేల క్యూబిక్ మీటర్ల మట్టిని లారీలతో తరలిస్తున్నారు.
వివాదాస్పదంగా మారిన అల్లీపూర్ చెరువు పూడికతీత - అల్లీపూర్ చెరువులో మట్టి తరలింపుపై వివాదం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ చెరువు పూడికతీత వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చెరువులోని మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆయకట్టు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా వార్తలు
లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో కూడా మట్టిని టిప్పర్లతో ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఈ విషయం తమకు తెలియకుండా అల్లీపురం గ్రామపంచాయతీ మట్టి తరలింపు నిర్ణయం తీసుకోవడం ఏంటని గుడిరేవు రైతులు చెరువువద్ద నిరసనకు దిగారు. సారవంతమైన మట్టిని ఇటుకు బట్టీలకు తరలించడం నిలిపేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?