మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ భారతి హోళీకేరి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూరికార్డుల్లో జరిగిన అవకతవకలపై గ్రామ సభలు నిర్వహించి ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో రెండు నుంచి మూడు రోజులు నిర్వహించి ఆ ప్రాంత గ్రామ ప్రజల భూ సమస్యలను తొలగిస్తామన్నారు. కొన్ని భూ సంబంధిత కేసులు తమ పరిధిలోలేని వాటిని కోర్టులో పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ భూరికార్డుల ప్రక్షాళనలో కొందరు వీఆర్వోలు అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలతో జిల్లా వ్యాప్తంగా వీఆర్వోలను స్థానచలనం చేశామన్నారు.
భూరికార్డులలో అవకతవకలపై ప్రక్షాళన - మంచిర్యాల జిల్లా
అత్యంత క్లిష్టమైన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని గ్రామ సభలు నిర్వహించి చేస్తున్నామన్నారు మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీ కేరి.
భూరికార్డులలో అవకతవకలపై ప్రక్షాళన