పట్టణాల్లో చెత్త, కాలుష్యం, కలుషిత నీటిని మన శత్రువులుగా భావించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు.
స్థానిక శిశుమందిర్ పాఠశాల నుంచి అంబేడ్కర్ నగర్ చౌరస్తా వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఓ ఇంటి పక్కన మట్టి కుప్పలు, చెత్త ఉండడం వల్ల ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా రోడ్లపై చెత్తవేస్తే రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు.