మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు జరుగుతున్నాయి. సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాల నుంచి 350 మంది కార్మిక క్రీడాకారులు పాల్గొంటున్నారు.
హోరాహోరీగా కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు - మంచిర్యాలలో కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు
మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో ఏడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు.
హోరాహోరీగా కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు
ఇప్పటివరకు సింగరేణి జట్టు వివిధ విభాగాల్లో 11 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించింది. వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఏరియా జీఎం రమేశ్ రావు, పర్సనల్ మేనేజర్ మురళీధర్ రావు పతకాలు అందజేశారు.