కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలకు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సిద్ధమైంది. నేటి నుంచి జరగనున్న పోటీల్లో అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. పోటీల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం 15 లక్షల రూపాయలను విడుదల చేయగా... స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
నేటి నుంచి కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు - మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నేటి నుంచి రెండు రోజుల పాటు కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు.
నేటి నుంచి కోల్ ఇండియా అథ్లెటిక్ పోటీలు
క్రీడాకారులకు రాత్రివేళ ఎలాంటి ఇబ్బంది కలగకుండా 60 ఫ్లడ్ లైట్లను అమర్చారు. ఈ పోటీలను ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి:వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్లైన్లు